శ్వాస ఆధారంగా ఆరోగ్య పరిస్థితిని గుర్తించే సెన్సార్!
వదిలే శ్వాస ఆధారంగా వ్యక్తుల్లోని ఆరోగ్య పరిస్థితిని గుర్తించే సెన్సార్లు పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఒకసారి వినియోగించి పడేసే, అతి తక్కువ వ్యయమయ్యే ఈ సెన్సార్ పరీక్షలతో వ్యక్తులు తమకు రాబోయే ఆరోగ్య సమస్యలను ముందస్తుగానే గుర్తించి వైద్యుల సలహా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన ఇల్లినాయిస్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో అమోనియా గాఢతతో మార్పులను పరిశీలించడం ద్వారా మూత్రపిండాల సమస్యను గుర్తించవచ్చు. దీని ఆధారంగా విడిచే శ్వాసలో కేవలం ఆమోనియాకు మాత్రమే ప్రతిస్పందించే పదార్థాన్ని ఎంపిక చేసి మూత్రపిండాల వ్యాధి సమస్యను గుర్తించే ఓ సెన్సార్‌ను పరిశోధకులు తయారు చేశారు. సెన్సార్‌లో మూలకాల్ని మార్చడం ద్వారా ఇతర వ్యాధులను కూడా గుర్తించవచ్చని చెబుతున్నారు.













