ఒబామా ‘స్పైడర్’
నవ్వు ముఖంతో ఉన్న 15 కొత్త సాలీడు జాతులను శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఒరాక్ ఒబామా, లియానార్డో డికాప్రియో, బెర్నీ శాండర్స్ వంటి ప్రముఖుల పేరిట అరుదైన స్పైడర్ జాతులకు నామకరణం చేశారు. కొత్త సాలీడు జాతుల్లో ఎస్ ఒరాక్ ఒబామై, ఎస్ మిషెల్ ఒబామే, ఎస్ లియనార్డో డికాప్రియోలు ఉన్నాయి. అధ్యయనంలో శాస్త్రవేత్తలకు సహకరించిన పలువురు విద్యార్థుల పేర్లను కూడా సాలీడులకు పెట్టారు. అమెరికాలోని ఫ్లోరిడా, నార్త్కరోలినాతో పాటు కరీబియన్ దీవులు, మెక్సికో, కొలంబియాలో ఈ సాలీడు జాతులను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.













