భవిష్యత్తులో చెరకుతో ఇంధనం!
భవిష్యత్తులో చెరకు ద్వారా కార్ల ఇంధనాన్ని తయారు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యుపరమైన మార్పులతో తీర్చిదిద్దిన చెరకు ఆకుల నుంచి ఇంధనాన్ని, కాండాల నుంచి బయోడీజిల్‌ను తయారుచేయొచ్యని గుర్తించారు. ఇలా తీర్చిదిద్దిన చెరకు పంటతో మరింత చక్కెర తయారీ సాధ్యమవుతుందనీ, ఈథనాల్ ఉత్పత్తిలోనూ ఉయోగించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. రెండు రకాలుగా ఉపయోగపడే జీవ ఇంధన పంటలు సోయాకన్నా ఎకారానికి ఐదురెట్లు, మొక్కజొన్నకన్నా రెండురెట్లు అధిక లాభాల్ని అందిస్తాయని అమెరికా ఇలినాయిస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పేర్కొన్నారు. చెరకు రసాన్ని పులియబెట్టే ప్రక్రియ ద్వారా ఈథనాల్ను, తర్వాత జీవద్రావకాల ద్వారా ఇంధనాన్ని రూపొందించవచ్చని వివరించారు. జన్యుపరంగా తీర్చిదిద్దిన రెండు రకాల చెరకు మొక్కల ద్వారా 0.5, 0.8 శాతం ఇంధనాన్ని సేకరించినట్లు తెలిపారు. తాము రూపొందించిన విధానంలో చెక్కెర ఉత్పత్తికి నష్టం లేకుండానే మరింత చమురు తయారీకి తోడ్పడుతున్నట్లు గుర్తించామన్నార. ఈ అధ్యయనంలో భారత సంతతి పరిశోధకులు విజయ్‌సింగ్ కూడా పాలుపంచుకున్నారు.













