మైక్రోసాఫ్ట్ పయనంపై నాదెళ్ల పుస్తకం
అంతర్జాతీయంగా అత్యంత పేరు ప్రతిష్ఠలు పొందిన భారత సిఇఒల్లో ఒకరైన సత్య నాదెళ్ల సిఇఒ స్థాయికి చేరే వరకు మైక్రోసాఫ్ట్‌లో తన ప్రయాణంపై ఒక పుస్తకం రచించారు. ఆయన వ్యక్తిగత, వృత్తి జీవనంపై మరింత లోతైన అవగాహన ఏర్పడేందుకు ఈ పుస్తకం సహాయకారి అవుతుంది. హిట్ రిఫ్రెష్ పేరిట గ్రెగ్ షా, జిల్ ట్రాసీ నికోల్స్ సహ రచయితలుగా వ్యవహరించిన ఈ పుస్తకం అమ్మకాలు ఈ నెల 26వ తేదీ నుంచి అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లలో ప్రారంభం అవుతాయి. దీనికి మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ముందుమాట రాశారు.








