యువతకు సాధికారత సదస్సులో సతీష్ వేమన
విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) తరగతులను నిర్వహిస్తూ ముందుకుసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) భాగస్వామ్యమౌతుందని తానా అధ్యక్షులు వేమన సతీష్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి తరగతుల నిర్వహణపై ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస కళాక్షేత్రంలో ఎస్వీయూ-అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న యువతకు సాధికారత సదస్సులో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల్లో విద్య, వ్యవసాయ రంగాలు ఎంతో కీలకమైనవని, ఈ రెండు రంగాల అభివృద్ధికి తానా అండగా నిలస్తుందని పేర్కొన్నారు. తానా సభ్యులు ఆంధ్రప్రదేశ్లో తమ తమ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.








