జెండావందనం స్వీకరించిన సతీష్ వేమన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు సతీష్ వేమనకు అరుదైన గౌరవం లభించింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా సొంత ఊరుకు వచ్చిన సతీష్ వేమనకు ఘన స్వాగతం లభించింది. స్వాతంత్య్రదిన వేడుకలను పురస్కరించుకుని 35 సంవత్సరాల క్రితం తాను చదువుకున్న స్కూల్లో జరిగిన జెండా వందన కార్యక్రమానికి సతీష్ వేమన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.








