డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ
కొంతమంది శరణార్థులకు అమెరికాలోకి ప్రవేశం కల్పించాల్సిందేనని శాన్ ఫ్రాన్సిస్కోలోని అప్పీళ్ల న్యాయస్థానం తీర్పునిచ్చింది. పలు దేశాల ప్రజలు అమెరికా రావడంపై అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకొంది. ఆశ్రయం కల్పిస్తామని దేశంలోని ఏదైనా హామీ ఇస్తే, అలాంటి శరణార్థులను ఆహ్వానించి, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ఆ సంస్థపై ఉందని పేర్కొంది. ఆశ్రయం కల్పించాలంటూ ఇదివరకే దరఖాస్తు చేసుకున్న దాదాపు 24వేల మందికి ప్రయోజనం కలిగించనుంది. ఈ దరఖాస్తులకు గతంలోనే ఆమోదం లభించినందున వీరి ప్రవేశాలకు ఇబ్బందులు ఉండబోవని భావిస్తున్నారు.








