TASA: శాన్ ఆంటోనియోలో ఘనంగా ఉగాది వేడుకలు.. ఏప్రిల్ 5న సాంస్కృతిక సంబరాలు!
TASA: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, శాన్ ఆంటోనియోలో ఉన్న తెలుగు వారందరినీ ఒకచోట చేర్చుతూ శాన్ ఆంటోనియో తెలుగు సంఘం (TASA) ఆధ్వర్యంలో 2026 ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. సంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు.
వేదిక, సమయం:
- తేదీ: ఏప్రిల్ 5, 2026 (ఆదివారం)
- వేదిక: మహాలక్ష్మి హాల్, హిందూ టెంపుల్ ఆఫ్ శాన్ ఆంటోనియో, 18518 బాండెరా రోడ్, హెలోట్స్, TX 78023.
కార్యక్రమ వివరాలు:
ఉగాది పండుగను పురస్కరించుకుని ఆ రోజు మధ్యాహ్నం నుండి రాత్రి వరకు వైవిధ్యభరితమైన కార్యక్రమాలను రూపొందించారు.
- మధ్యాహ్నం 2:00: పంచాంగ శ్రవణం
- మధ్యాహ్నం 2:15 – సాయంత్రం 6:00: సాంస్కృతిక ప్రదర్శనలు
- సాయంత్రం 4:00 – 5:00: అల్పాహారం (Snacks)
- సాయంత్రం 6:00 – రాత్రి 8:00: ‘ధ్వని’ (Dhwani) బృందం వారిచే లైవ్ మ్యూజిక్ కన్సర్ట్
- రాత్రి: లైవ్ కుకింగ్ అనుభవంతో కూడిన విందు భోజనం
రిజిస్ట్రేషన్, ఫీజు:
ఈ వేడుకల్లో పాల్గొనే వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- లైఫ్ మెంబర్స్: $10
- పెద్దలు (Adults): $15
- పిల్లలు (5-13 ఏళ్లు): $10
చెల్లింపులు ‘Zelle’ ద్వారా (paytotasa@gmail.com) చేయవచ్చు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వారు పోస్టర్లోని క్యూఆర్ (QR) కోడ్ ద్వారా లేదా TASA వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం అనిల్ కోడాలి (216-650-9265) లేదా స్వాతి మల్లా (210-363-8404)ను సంప్రదించవచ్చు.







