యూఎస్ ఓపెన్‌కు సైనా
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్లో ఆడనుంది. ఈ టోర్నీ వచ్చే నెల 19 నుంచి 23 వరకు కాలిఫోర్నియాలో జరుగనుంది. ఈ టోర్నీతో పాటు రానున్న మరో మూడు అంతర్జాతీయ ఈవెంట్ల కోసం భారత జట్టును జాతీయ బ్యాడ్మింటన్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. యూఎస్ ఓపెన్‌కు మహిళల సింగిల్స్‌లో సైనా, పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ, ప్రణయ్, కశ్వప్‌లు భారత్ నుంచి పోటీపడనున్నారు.








