అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హస్తం
గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 21 రాష్ట్రాలో రష్యా హ్యాకింగ్‌కు పాల్పడిందని ఓ అమెరికా అధికారి అమెరికా కాంగ్రెస్‌కు చెప్పారు. ఆ సమయంలో అమెరికా హెచ్చరికల నుంచి దృష్టి మళ్లీంచేందుకు ట్రంప్ లైంగిక విజయాలపై వీడియో ఒకటి బయటకు వచ్చిందని తెలిపారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను అప్రతిష్ఠ పాల్జేసేందుకు క్రెమ్లిస్ విస్తృతస్థాయిలో కుట్రలు జరిపిందన్నారు. ఓటర్ల నమోదు డాటా బేస్ హ్యాకింగ్‌కు గురవుతున్నదని తాను పలుమార్లు హెచ్చరించానని ఒబామా ప్రభుత్వంలో హోంశాఖలో పనిచేసిన జే జాన్సన్ చెప్పారు. కానీ నాడు ఎవరూ తన హెచ్చరికలను పట్టించుకోలేదన్నారు. అప్పుడే ట్రంప్ తన లైంగిక విజయాలను గూర్చి గొప్పలు చెప్పుకున్న 2005 నాటి వీడియో ఒకటి బయటకు వచ్చిందని, అది తన హెచ్చరికల నుంచి అమెరికన్ల దృష్టి మరల్చిందన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా పాత్రపై ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఊహాగానాలు సాగుతున్నాయి. రష్యా 21 రాష్ట్రాల్లో హ్యాకింగ్‌కు పాల్పడటం నిజేమనని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారి జీనెట్ మన్ఫ్రా తొలిసారి బహిరంగంగా ప్రకటించారు. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని సెనేట్ ఇంటెలిజెన్స కమిటీ ముందు వెల్లడించారు.













