అమెరికా వైఖరిని ఖండిచిన రష్యా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన క్యూబా వ్యతిరేక చర్యలను రష్యా తీవ్రంగా ఖండించింది. ట్రంప్ చర్యలు విచారకరమన్న రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం క్యూబాకు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలు ప్రచ్చన్న యుద్ధ కాలాన్ని స్ఫురణకు తెస్తున్నాయని వివరించింది. క్యూబాతో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు గత ఒబామా సర్కారు చేపట్టిన చర్యలను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.








