తెలుగు రాష్ట్రాలలోనే కాదు ….అమెరికాలో అదే క్రేజ్
తెలుగు రాష్ట్రాలలో రేవంత్ రెడ్డి పట్ల కనిపించే క్రేజ్ అమెరికాలోనూ అదే స్థాయిలో కనిపించింది. చికాగోలో జరిగిన ఉత్సవాలలో రేవంత్ రెడ్డి మాట్లాడడానికి ముందుగా యాంకర్ ఆయన పేరును చెప్పడానికి ముందే తెలంగాణ టైగర్ అని మొదలు పెట్టడంతో ఆ ప్రాంతమంతా కేకలు, ఈలలు, చప్పట్లతో మారుమ్రోగిపోయింది. రేవంత్ వేదికమీదికి వచ్చిన మాట్లాడడానికి మైకును అందుకునే వరకు సభలో ఈ హోరు ఆగలేదు. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో జరిగిన మహానాడు సభలలో కూడా రేవంత్ పట్ల ఇదే క్రేజ్ కనిపించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పూర్తి క్లాస్‌గా ఉండే ఐటీ నిపుణులు పాల్గొన్న సంబరాల సభలో కూడా రేవంత్ పట్ల అదే క్రేజ్ కనిపించడం ఆయనపై తెలుగువారికి ఉన్న అభిమానానికి నిదర్శనమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.








