అదృశ్యమైన 74 ఏళ్ల తరువాత అంత్యక్రియలు
అమెరికా సైన్యంలో ఒకప్పుడు లెఫ్టినెంట్‌గా పనిచేసిన ఇతని పేరు రాబర్ట్ యూజీన్ ఆక్స్ఫర్డ్. రెండో ప్రపంచయుద్ధంలో పైలట్‌గా పని చేశారు. జనవరి 25, 1944న ఆయన నడుపుతున్న యుద్ధ విమానం హిమాలయాల్లో కుప్పకూలిపోవడంతో మృతి చెందారు. 2016లో ఆయన సమాధి గురించి తెలియడంతో అమెరికాలోని ఆయన కుటుంబసభ్యులకు భారత ప్రభుత్వం సమాచారం అందించింది. జార్జియాలోని కాన్కర్డ్లో అధికార లాంఛనాలమధ్య అంత్యక్రియలకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాబర్ట్ అస్థికలను ప్రత్యేకంగా అమెరికా తరలించారు.








