ఆపీల్ షూస్… 19.29 లక్షలు!
ఆపీల్ స్మార్ట్ఫోన్లు చూశాం. ఆపిల్ కంప్యూటర్లూ చూశాం. మరి షూస్ ఏంటి అనుకుంటున్నారా? 1990లో ఆపిల్ యాజమాన్యం తమ ఉద్యోగుల కోసం ఆదిదాస్ కంపెనీకి ఆర్డరిచ్చి ప్రత్యేకంగా బూట్లు తయారు చేయించింది. వాటిలో మొత్తం రెండు జతలు మాత్రమే మిగిలి ఉన్నాయట. ఇందులో ఓ జతను ఈ-బేలో వేలం వేయాలని నిర్ణయించారు. కనీసంగా ఈ బూట్లకు 19.29 లక్షల ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.








