తానా బ్యాక్‌ప్యాక్ కమిటీ అధ్యక్షుడిగా ఉప్పుటూరి రాంచౌదరి
గుంటూరు జిల్లాకు చెందిన, ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో నివాసం ఉంటున్న ఉప్పుటూరి రామ్‌చౌదరి ఉత్తర అమెరికా తెలుగు సంఘం( తానా) బ్యాక్‌ప్యాక్ (పాఠశాల బ్యాగులు) విభాగానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అమెరికా దేశవ్యాప్తంగా పలు పాఠశాలల్లోని పేద విద్యార్థులకు సంస్థ ఆధ్వర్యంలో స్కూల్‌బ్యాగ్, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఇతర వస్తువులను ఈ విభాగం ద్వారా ఉచితంగా అందిస్తారు. తన హయాంలో ఈ కార్యక్రమం మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తానని ఉప్పుటూరి తెలిపారు. రామ్‌చౌదరి గుంటూరు జిల్లాలో కూడా పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. వట్టిచెరుకూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్ తరహాలోనే స్కూల్ బ్యాగ్‌లు, నోట్ పుస్తకాలను అందజేస్తున్నారు.








