న్యూయార్క్ బహిరంగ సభలో ప్రసంగించనున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు న్యూయార్క్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఎన్నారైలను ఆకట్టుకునే క్రమంలో స్థానిక పార్టీ విదేశీ విభాగం ఏర్పాటు చేసిన సభలో రాహుల్ ప్రసంగిస్తారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ ఇప్పటికే వాషింగ్టన్లో డెమొక్రటిక్ పార్టీ అనుకూల మేధావుల సంస్థ సెంటర్ ఫర్ అమెరిన్ ప్రోగ్రెస్ సభ్యులతో సమావేశమయ్యారు.








