మేక్ ఇన్ ఇండియా నాకు బాగా నచ్చింది
మేక్ ఇన్ ఇండియా నాకు బాగా నచ్చింది కానీ దాని అమలు సక్రమమైన పద్ధతిలో లేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం తనకు ఎంతో బాగా నచ్చిందని అన్నారు. పెద్ద వ్యాపారులను లక్ష్యంగా పెట్టుకోవాలని మోదీ భావిస్తున్నారు. కానీ మధ్య, చిన్న తరహా కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటే బాగుండేది. అక్కడి నుంచే ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయి అని అన్నారు. భారత్లో నిత్యం 30వేల మంది యువత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ 450 మాత్రమే ఉద్యోగాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాను కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయిందని ఆయన స్వీయ విమర్శ చేసుకున్నారు.













