ట్రంప్ కు స్వస్థలంలో నిరసనల సెగ
ఒబామాకేర్ రద్దు కోసం దూకుడుగా దూసుకుపోపోతోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తన స్వస్థలం న్యూయార్క్‌లో నిరసనల సెగ తగిలింది. వందలాది మందిని నిరసనకారులు ఆయనకు వ్యతిరేకంగా నినదించారు. ట్రంప్‌ను పాతి పెట్టండి (డంప్ ట్రంప్), అమెరికా మళ్లీ ఆలోచించేలా చేయండి అంటూ పెద్ద పెట్టున బ్యానర్లు, ప్లకార్డులతో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టినట్లు న్యూయార్క్ డైలీ న్యూస్‌లోని ఒక నివేదిక ద్వారా వెల్లడైంది.








