గాంధీ భాటలో ప్రపంచ దేశాలు…
ప్రపంచంలోని అన్ని దేశాలు మహాత్మాగాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నాయని గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. టెక్సాస్ లోని డల్లాస్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అమెరికాలో ప్రవాసాంధ్రులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయం అన్నారు. తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ తోటకూర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








