నువ్వు కాదు నేను ఈ దేశానికి అధ్యక్షుడిని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టైమ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను సమర్థించుకున్నారు. నేను ఓ తరహా ఆలోచనలు కలిగిన వ్యక్తిని, నా స్వభావం, ఆలోచనలు సరైనవి, అవే నిజమవుతాయి. నేను అంత చెడుగా ఏమీ చేయట్లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ దేశానికి అధ్యక్షుడిని. నువ్వు కాదు అని టైమ్స్ వాషింగ్టన్ బ్యూరో చీఫ్ మైకేల్ షారెర్తో ట్రంప్ అన్నారు. ఇంటర్వ్యూలో తన పాలసీలకు మద్దతిస్తూ మాట్లాడారు.













