అధ్యక్షుడి బ్రౌజింగ్ డేటాను అమ్మేస్తాం!
అమెరికాలో ఆన్లైన్ ప్రైవసీ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇంటర్నెట్ వినియోగదారుల బ్రౌజింగ్ హిస్టరీని సర్వీస్ ప్రొవైడర్లు అమ్మేసుకునే అవకాశం కల్పించే దిశగా ట్రంప్ సర్కారు అడుగులు వేస్తోంది. అందుకు ఒబామా హయాంలో తీసుకొచ్చిన ఆన్లైన్ ప్రైవసీ నిబంధనలకు గుడ్‌బై చెప్పేందుకు తాజాగా హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌లో తీర్మానం చేశారు. ఇక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకమే తరువాయి. ఈ పరిణామాలతో ట్రంప్ సర్కాప్పై నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగదారుల అభిరుచులను, ఆసక్తులను ఆంగట్లో సరుకు మాదరిగా అమ్మేసేలా చేస్తున్న చర్యలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






