సౌదీ అరేబియా చేరుకున్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా చేరుకున్నారు. ఎనిమిది రోజుల పర్యటనలో ఆయన ఇజ్రాయిల్, పాలస్తీనా, బ్రసల్స్, వాటికన్, సిసిలీ వెళ్లనున్నారు. ఇస్లామ్ యూద, క్రైస్తవ పుణ్యక్షేత్ర ప్రదేశాలను టచ్ చేసే విధంగా ట్రంప్ టూర్ ప్లాన్ చేశారు. రియాద్ విమానాశ్రయంంలో ఎయిర్ పోర్స్ వన్ దిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంపై అమెరికా, అరేబియా దేశాలు సరికొత్త నిర్ణయాన్ని తీసుకునే వీలు ఉంది. అయితే డొనాల్డ్ టూర్‌పై అమెరికాలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కొమెను అర్థాతరంగా తప్పించడంతో ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ట్రంప్ రాక సందర్భంగా యెమెన్ రెబల్స్‌పై సౌదీ అరేబియా వైమానిక దాడులు చేసింది.








