71వ వసంతంలోకి డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. అమెరికా అధ్యక్షుడయ్యాక ఆయన తొలిసారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. వైట్ హౌజ్‌లో అధ్యక్షుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నారు. అటు ఢిల్లీలో హిందూసేన ట్రంప్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించింది. కేక్ కట్ చేసి ట్రంప్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.








