ట్రంప్ జోక్యం చేసుకున్నారు…
గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకున్నారనేందుకు తగిన ఆధారాలున్నాయని అమెరికా మాజీ ఫెడరల్ ప్రాసిక్యూటర్ ప్రీత్భరారా ప్రకటించారు. ఎఫ్బిఐ డైరెక్టర్ జేమ్స్ కామీని తొలగించటానికి ముందు ఆయన్ను బుజ్జగించిన రీతిలోనే తనను కూడా బుజ్జగించేందుకు ట్రంప్ ప్రయత్నించారని భరారా వెల్లడించారు. ఈ సమయంలో ట్రంప్ తనపై వచ్చిన ఆరోపణల విషయంలో దర్యాప్తునకు ఆదేశించే చట్టపరమైన అధికారం ఆయనకు వున్నదీ లేనిదీ తెలియాల్సి వుందన్నారు. ట్రంప్ అధికార బాధ్యతలు స్వీకరించిన వెంటనే భరారాతో సహా మొత్తం 45 మంది అటార్నీల రాజీనామాలకు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.













