అమెరికాలో మళ్లీ కాల్పుల మోత!
అమెరికాలోని విస్కాన్సిన్లో మళ్లీ కాల్పులు మోత మోగింది. ఉత్తర విస్కాన్సిన్లో ఓ వ్యక్తి యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారితోపాటు మరో ముగ్గరు ప్రాణాలు విడిచారు. ఓ బ్యాంకులో జరిగిన కుటుంబ వివాదం కారణంగా నిందితుడు కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఎవరెస్ట్ మెట్రో పోలీసు చీప్ వ్యాలీ స్పార్క్స్ వెల్లడించింది. నిందితుడి గురించి మరిన్ని వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. విస్కాన్సిన్లోని ఓ బ్యాంకులో, ఓ న్యాయసేవల సంస్థలో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్ర ఎదురుకాల్పుల అనంతరం నిందితుడినిని అదుపులోకి తీసుకున్నారు.






