మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి భేటీ
అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మోదీ కలుసుకోవడానికి ముందే పలు అంశాలపై టిల్లర్సన్ చర్చించారని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు. మోదీ బసచేసిన హోటల్ విల్లార్డ్‌కు టిల్లర్ సన్ వచ్చారని తెలిపారు. అంతకుముందు అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ కూడా వచ్చి మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ పర్యటన భారత్, అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని, ఉగ్రవాదంపై పోరు, ఆర్థికాభివృద్ధి, శ్రేయస్సు వంటి ఉమ్మడి ప్రయోజనాలకు ఊతం ఇవ్వగలదని పేర్కొన్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఉభయ దేశాలు లోతైన వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉండాలని, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సన్నిహితంగా కలిసి పని చేయాలని ఇద్దరు నేతలు అంగీకరంచారని చెప్పారు.








