ప్లేబాయ్ వ్యవస్థాపకుడు ఇకలేరు
ప్రముఖ ఎంటర్టైనమెంట్ మ్యాగజైన్ ప్లేబాయ్ వ్వవస్థాపకుడు హ్యు హెఫ్నర్ (91) కన్నుమూశారు. అనారోగ్యంతో తన స్వగృహంలో హ్యూ తుదిశ్వాస విడిచారు. ఫ్యాషన్ ప్రపంచంలో హ్యూ సరికొత్త విప్లవం తీసుకొస్తూ ప్రత్యేకించి మగవారి కోసం 1953లో ప్లేబాయ్ 1600 డాలర్లతో మ్యాగజైన్‌ను ప్రారంభించారు. తొలినాళ్లలో క్యాలెండర్‌గా దర్శనమిచ్చిన ప్లే బాయ్ తర్వాతి కాలంలో మాగ్జైన్గా మారిపోయింది. కవర్ పేజీతో సహా మొత్తం న్యూడ్ఫోటోలతో కథనాలను ప్రచురించేంది. ఈ మ్యాగజైన్ తొలి ముద్రణలో అలనాటి అందాల తార మార్లిన్ మన్రో చిత్రాన్ని ప్రచురించింది. ప్లే బాయ్ ప్రస్థానం సుమారు ఆరు దశాబ్దాలపాటు నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. హ్యూను టైమ్స్ మ్యాగజైన్ ప్రొఫెట్ ఆఫ్ పాప్ హెడొనిజమ్గా అభివర్ణించింది.








