టాంటెక్స్ సాహిత్య సదస్సుకు ముఖ్య అతిధిగా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నెలనెలా తెలుగు వెన్నెల పేరుతో నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 16న 122వ సాహిత్య సదస్సును ఏర్పాటు చేసినట్లు సాహిత్య వేదిక సమన్వయకర్త శారద సింగిరెడ్డి తెలిపారు. ఇర్వింగ్లోని వాల్నట్ హిల్ లేన్లో ఉన్న 1404 డబ్ల్యులో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఎనుకుదురాట పేరుతో అచ్చ తెలుగు అష్టావధానం అంశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని ఆమె కోరారు.








