పాకిస్తాన్‌కు ఉహించని షాక్…
పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా ఊహించని షాకిచ్చింది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక పాక్ విషయంలో సృష్టమైన వైఖరితో వెళ్తున్నట్లు కనిపిస్తున్న అమెరికా, ఈ సారి పాక్‌కు గట్టి ఝలక్ ఇచ్చింది. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఇచ్చే ఆర్థిక సాయాన్ని నిలిపివేసి, పలు కండీషన్లను పెట్టిన అమెరికా, ఈ సారి పాక్‌ను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాల జాబితాలో పాకిస్థాన్‌ను అమెరికా చేర్చుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2016లో లష్కరే తాయిబా, జైషే మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలు పాక్‌లో స్వేచ్ఛగా విహరిస్తూ, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ, నిధులు సేకరించాయని అమెరికా నిర్ధారించింది. దీంతో అఫ్గానిస్థాన్, సోమాలియా, ట్రాన్స్ సహారా, సులవేసీ సీస్ లిట్టోరల్, దక్షిణ ఫిలిప్పైన్స్, ఈజిప్టు, ఇరాక్, లెబనాన్, లిబియా, యెమన్, కొలంబియా, వెనెజువెలా సరసన పాకిస్థాన్‌ను చేర్చింది.








