న్యూజెర్సిలో ఘనంగా ‘పాఠశాల’ వసంతోత్సవం
న్యూజెర్సి పరిసర ప్రాంతాల్లోని తెలుగు చిన్నారులకు మాతృభాషను నేర్పుతున్న పాఠశాల వసంతోత్సవం జూన్ 17వ తేదీన సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారై పిల్లల కోసం ప్రవేశపెట్టిన ‘తెలుగు పలుకు’ కోర్స్‌ను ఎపి ప్రభుత్వవిద్యాశాఖతో కలిసి నేర్పుతున్నట్లు చెప్పారు. సులభంగా తెలుగును నేర్చుకునేలా సిలబస్‌ను కూడా మార్చినట్లు తెలిపారు. పాఠశాల ఏరియా డైరెక్టర్ రామ్వేదాంతం?కూడా పాఠశాల విద్యాబోధనపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లను పరీక్షల్లో ఉత్తీర్ణులైన చిన్నారులకు బహూకరించారు. టిఫాస్ ప్రెసిడెంట్ గురుఆలంపల్లి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడారు.













