17న న్యూజెర్సిలో ‘పాఠశాల’ వసంతోత్సవం
న్యూజెర్సిలోనూ పరిసర ప్రాంతాల్లోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న పాఠశాల విద్యాసంవత్సరం ముగింపులో వసంతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం వసంతోత్సవ వేడుకలను జూన్ 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు, పాఠశాల ఏరియా డైరెక్టర్ రామ్ వేదాంతం తెలిపారు. సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్‌లోని 1 క్రాగ్వుడ్ రోడ్లో ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులచే తెలుగు భాషా వైభవాన్ని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపును పాఠశాల పొందిన సంగతి తెలిసిందే. దాంతోపాటు ఎపి ప్రభుత్వం ఎన్నారైలకోసం ప్రవేశపెట్టిన తెలుగుపలుకు కోర్స్‌ను పాఠశాల చిన్నారులకు నేర్పిస్తోంది.













