హెచ్-1బి దరఖాస్తుల్లో భారతీయులే అధికం
అగ్రరాజ్యం అమెరికాలో పనిచేయాలన్న మోజు రోజురోజుకూ పెరుగుతోంది. హెచ్-1బి వీసా పొందిన ఉద్యోగి సగటు జీతం చూస్తే కళ్లు తిరుగుతాయి. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో పనిచేసేందుకు హెచ్-1బి వీసాల కోసం గడచిన 11 సంవత్సరాల కాలంలో దరఖాస్తు చేసుకున్న భారతీయుల సంఖ్య అక్షరాల 21 లక్షలు. యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తాజా నివేదిక ప్రకారం వారి సగటు జీతం 92,317 అమెరికన్ డాలర్లు. ఈ నివేదిక ప్రకారం 2007నుంచి 2017, జూన్ వరకు 34లక్షల మంది హెచ్-1బి వీసాలకోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో భారత్‌నుంచి దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 21 లక్షలు. వీరిలో 26 లక్షల మందికి అమెరికా హెచ్-1బి వీసాలను మంజూరు చేసింది.








