టెక్సాస్ వర్సిటీలో దుండగుడు బీభత్సం
అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. క్యాంపస్‌లోకి చొరవడి విద్యార్థులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. దుండగుడు కూడా అదే యూనివర్సిటీలో చదువుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అతన్ని అదపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం అమెరికాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. శాన్ డియోగోలో కొందరు జన్మదిన వేడుకలు జరుపుకొంటుండగా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు.








