అమెరికన్ల మద్దతు కోల్పోతున్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఓటు వేసిన ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఇప్పుడు అవకాశం వస్తే మళ్లీ ట్రంప్‌కు ఓటు వేయరదని భావిస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన ఆరు మాసాల్లో ట్రంప్ పాలనను గమనించిన వారు ఈ అభిప్రాయానికి వచ్చినట్లు రాయిటర్స్ / ఇప్సాస్ పోల్‌లో వెల్లడైంది. తమకు అవకాశం వస్తే ట్రంప్‌ను వెనక్కి పిలవాలని వారు భావిస్తున్నారు. ప్రధానంగా శ్వేత జాతీయుల్లోనే ట్రంప్‌కు వ్యతిరేకత ఎక్కువగా వుంది. చాలా తక్కువ ఓట్ల తేడాతో శ్వేత సౌధంలోకి అడుగు పెట్టిన ట్రంప్‌కు తానకుకున్న ఎజెండాను అమలు చేయాలంటే ప్రతిఒక్క మద్దతుదారుని తోడ్పాటు అవసరమే. కాగా, మే మొదటి వారంలో, జూలైలో ఈ సర్వేను నిర్వహించారు.













