డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిచ్చిన జూనియర్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి నుంచి అనూహ్యంగా ట్రంప్ చే ఉద్వాసనకు గురైన జేమ్స్ కోమీ సెనేట్ ప్యానల్ మందు తనను తాను నిరూపించుకుండగా, వరుస లైవ్ ట్వీట్లతో తండ్రికి గట్టి మద్దతిచ్చారు జూనియర్ ట్రంప్. మొత్తం 80 పైగా ట్వీట్లను ఆయన చేశారు. ఈ విషయంలో కొంచెం ట్రంప్ నిదానంగా ఉన్నప్పటికీ, కొడుకు మాత్రం తన ప్రతాపం చూపించారు. కోమీ, సెనేటర్లు చేసిన ప్రతి ఆరోపణకు ట్విట్టర్ ద్వారానే సమాధానమిచ్చారు.













