సెనేట్లో వీగిపోయిన ఒబామాకేర్
ఒబామాకేర్ రద్దుకు అమెరికా ఎగువ సభ సెనేట్లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోయింది. సభలో రిపబ్లికన్లకు ఆధిక్యం ఉన్నప్పటికీ బుధవారం జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 45 మంది సెనేటర్లు, వ్యతిరేకంగా 55 మంది సెనేటర్లు ఓటు వేశారు. ఒబామాకేర్కు ప్రత్యామ్నాయాన్ని ప్రతి పాదించిన ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో ఏగుడురు రిపబ్లికన్లు కూడా ఉన్నారు. ఒబామాకేర్ స్థానంలో మరో విధానాన్ని తీసుకురావడంపై చర్చను చేపట్టేందుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.








