రికార్డులు సృష్టించిన ఒబామా సందేశం
గత కొన్ని రోజులుగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న జాత్యహంకార నిరసనల నేపథ్యంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా చేసిన ట్వీట్ రికార్డులు సృష్టిస్తోంది. రంగు లేదా మతం ఆధారంగా వ్యక్తులపై కలిగే వివక్ష పుట్టుకతోనే కలగదంటూ గత శనివారం ఆయన చేసిన ట్వీట్‌ను 28 లక్షల మంది లైక్ కొట్టారు. దీన్ని అత్యధికులు లైక్ చేసిన ట్వీట్‌గా ట్విట్టర్ ప్రకటించింది. అంతకన్నా ముందు ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో ఉగ్రదాడి సందర్భంగా పాప్‌గాయని అరియానా గ్రాండీ చేసిన ట్వీట్ తొలి స్థానంలో ఉండేది. దాదాపు 12 లక్షల మంది ఒబామా ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఎక్కువ మంది రీట్వీట్ చేసిన ఐదో ట్వీట్‌గా దీనిని ఆ సంస్థ పేర్కొంది.













