సోషల్ మీడియా పట్ల యువత అప్రమత్తం….ఒబామా
జనవరిలో అధ్యక్షుడుగా వైదొలగినప్పటి నుండి పెద్దగా వార్తల్లోకి రాని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా తొలిసారిగా చికాగో యూనివర్సిటీ విద్యార్థుల ఫోరం సమావేశాల్లో పాల్గొన్నారు. నాయకత్వంపై, సోషల్ మీడియాను ఉపయోగించడంపై వివాహాల విషయంలో యువతకు సలహాలు, సూచనలందచేయాలని ఒబామా భావించారు. అందుకు ఈ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. కమ్యూనిటీ నిర్వాహకునిగా, యువ రాజకీయవేత్తగా ఇల్లినాయిస్లో తన కార్యాలయాన్ని నిర్వహించినపుడు తన అనుభవాలను వారితో పంచుకున్నారు. అనేక విషయాలపై పనిచేయాలని భావించానని, అనేక అంశాలపై దృష్టి పెట్టాలని అనుకున్నానని, అయినప్పటికీ రాబోయే తరం నాయకత్వాన్ని తయారుచేయడానికి నా వంతుగా ఏం చేయగలనా అని ఆలోచించానని, అది చాలా ముఖ్యమనిపించిందని ఒబామా పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో దిశా నిర్దేశం చేయగల, చేసే బాధ్య యువతరంపై వుందని అన్నారు. అతి చిన్న వయస్సునుండే సోషల్ మీడియాలో వుంటున్న యువత గురించి మాట్లాడుతూ ఆన్లైన్లో పోస్ట్ చేసే ఫోటోల విషయంలో పరిమితులు వుండాలని కోరారు. సెల్ఫీ విషయంలో కూడా చాలా అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఈ సమాజం నాకు చాలా ఇచ్చింది. ప్రతిగా నేను కూడా ఈ ప్రజలకు చాలా ఇవ్వాలనుకుంటున్నానని ఒబామా వ్యాఖ్యానించారు.













