ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన అమెరికన్
తనకు ఎంతో ఇష్టమైన చికెన్ నగెట్స్ కోసం 16 ఏళ్ల పిల్లాడు ట్విటర్లో చేసిన ఓ అభ్యర్థన ఏకంగా ప్రపంచ రికార్డునే తిరగరాసింది. అమెరికాకు చెందిన కార్టర్ విల్కర్సన్కు చికెన్ నగెట్స్ అంటే మహా ఇష్టం. వెండీస్ అనే రెస్టారెంట్‌కు గత నెల్లో వెళ్లిన అతడు, ఎన్ని రీట్వీట్లు వస్తే తనకు ఏడాదిపాటు ఉచితంగా నగెట్స్ ఇస్తారంటూ ట్విటర్లో ప్రశ్నించాడు. 1.8 కోట్ల రీట్వీట్లు సాధిస్తే 365 రోజులూ ఉచితంగా ఇస్తామని రెస్టారెంట్వర్గాలు బదులిచ్చాయి. విల్కర్సన్ అమాయక ప్రశ్న ట్విటర్లో వైరల్‌గా మారింది. అతడి ప్రశ్నను 34,30,500 మంది రీట్వీట్ చేశారు. ఇది గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించింది. అబ్బురపడిన వెండీస్ స్పందిస్తూ, విల్కర్సన్కు ఏడాది పాటు ఉచితంగా నగెట్లు అందజేస్తాని ప్రకటించింది.













