అమెరికాలోని కాలేజీలో కాల్పులు
అమెరికాలో కళాశాలలో కాల్పుల కలకరం రేపింది. ఒక విద్యార్థి తన సహచర విద్యార్థిని కాల్చి చంపిన తరువాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టెక్సాస్లోని నార్త్ లేక్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది. అకస్మాత్తుగా కాల్పుల శబ్దం వినిపించడంతో విద్యార్థులు వణికిపోయారు. పలువురు విద్యార్థులు పరుగులు తీశారు. సుమారు 1100 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్న కళాశాలలో తుపాకి కాల్పుల శబ్దం వినపడడంతో హడలిపోయారు. విద్యార్థులు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారని తెలుస్తోంది.








