అమెరికాలో హాట్ టాపిక్ ఇదే!
అమెరికాలో ఎవరిని కదిలించినా, ఎక్కడ చర్చ జరిగినా ఉత్తర కొరియా గురించి టాపిక్కే ఉంటోంది. తాజాగా, ఉత్తర కొరియా న్యూక్లియర్ క్షిపణిని ప్రయోగించిన అనంతరం అమెరికన్లలో అణు బాంబుల భయం పెరిగిపోయిందని అమెరికాలో ఆరోగ్య శాఖలో పని చేస్తున్న రాబర్ట్ లెవిన్ చెబుతున్నారు. అయితే దురదృష్టవశాత్తు యుద్ధం వస్తే, ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలనే విషయంపై ఆయన అవగాహన కల్పిస్తున్నారు. అణు బాంబు నుంచి రక్షణ కల్పించుకునే విషయంలో ఇతర రాష్ట్రాల ప్రజల కంటే కాలిఫోర్నియా వాసులు ముందంజలో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అణు బాంబు దాడి జరిగినప్పుడు బంకర్లలో దాక్కునే అవకాశం అందరికీ ఉండదని చెప్పిన ఆయన, అలాంటి వారు ఇంటి నుంచి బయటకు రాకూడదని, ప్రధానంగా బాత్ రూమ్ నుంచి అస్సలు బయటకు రాకూడదని చెబుతున్నారు. తాము ఉంటున్న ప్రాంతానికి సమీపంలో బాంబు పడితే ఆలస్యం చేయకుండా వెంటనే దస్తులు మార్చుకోవాలని సూచించారు. సబ్బుతో లేదా షాంపూతో గాన్ని స్నానం చేయాలని తెలిపారు. ఇది అణు బాంబు ప్రభావం నుంచి దూరం చేస్తుందని ఆయన చెబుతున్నారు.













