అమెరికా ఎన్నికల్లో చైనా, కొరియాల జోక్యం
అమెరికా ఎన్నికల్లో రష్యాతో పాటు చైనా, ఉత్తర కొరియాలు కూడా అనవసరంగా జోక్యం చేసుకున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని వెట్ హౌస్ చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ రెనిస్ పెరిబస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఓ టీవీ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ ఆ దేశాలు గతంలో కూడా ఇలా చేశాయని అన్నారు. ఇదే విషయాన్ని జీ-20 సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ట్రంప్ ప్రశ్నించారు. అలాంటిదేమీ లదని పుతిన్ చెప్పడంతో ట్రంప్ కూడా ఆయన మాటను కొంతవరకు విశ్వసించారు. కచ్చితంగా ఈ విషయం ఎవరికీ తెలియదంటూ వ్యాఖ్యానించారు. కానీ పుతిన్ మాటలను ట్రంప్ పూర్తిగా నమ్మడం లేదని పెరిబస్ చెప్పారు. ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ కూడా తమ దేశ ఎన్నికల్లో రష్యా అనవసరంగా జోక్యం చేసుకుందని, ఈ విషయం అందరికీ తెలిసిందేనని మరోసారి చెప్పారు.













