మా దేశంపై డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ప్రకటించాడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంపై యుద్ధం ప్రకటించారని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రీ యాంగ్ హో వ్యాఖ్యానించారు. ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికానే మాపై ముందు యుద్ధం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం గుర్తు పెట్టుకోవాలి. అమెరికాను నిలువరించేందుకు చర్యలు తీసుకునే అన్ని హక్కులూ మాకున్నాయి అని హో వ్యాఖ్యానించారు.








