ఎన్నారైల సహకారంతో అమెరికన్ సైన్స్ ఇన్స్టిట్యూట్ – నవనీతకృష్ణ
అమరావతిలో ఎన్నారైల సహకారంతో రూ.600 కోట్లతో 700 పడకల ఆస్పత్రిలో పాటు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని అమరావతి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఏఏఐఎంఎస్) వ్యవస్థాపకుడు గొర్రెపాటి నవనీత కృష్ణ చెప్పారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 7వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఏఏఐఎంఎస్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఎన్ఆర్ఐగా 40 ఏళ్ల పాటు అమెరికాలో డాక్టర్‌గా పనిచేసిన తాను, జన్మభూమికి సేవ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రానికి వచ్చానని చెప్పారు. ఏఏఐంఎంఎస్కు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్రహీంపట్నంలో 20 ఎకారాలు కేటాయించిందని, ఈ సంస్థను 21 మంది ఎన్ఆర్ఐల సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.








