హెచ్-1బీ వీసాల జారీపై పరిమితుల్లేవు
హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం సమీక్షిస్తున్నంతమాత్రాన భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హెచ్-1బీ వీసాల జారీపై పరిమితులేవీ లేవని ఆయన సృష్టం చేశారు. భారతీయులకు అందుతున్న హెచ్-1బీ, ఎల్1 (ఉద్యోగ అనుమతి) వీసాల సంఖ్యలో ఏటా 6 శాతం పెంపు ఉంటోందని అన్నారు. దౌత్య సంబంధాలపై వాషింగ్టన్లో ఈ నెల 27న భారత్-అమెరికా జరపనున్న ద్వైపాక్షిక చర్చల్లో, హెచ్1బీ వీసాల్లో కోత విధించే అంశమేదీ చర్చకు రాదని ఆయన పేర్కొన్నారు.













