గ్రామీణ వెలుగే ‘తానా ఫౌండేషన్’ లక్ష్యం – నిరంజన్ శృంగవరపు
వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న తానా ఫౌండేషన్‌కు చైర్మన్‌గా నిరంజన్ శృంగవరపు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితుల మెరుగుకు తానా ఫౌండేషన్ తరపున కృషి చేస్తామని చెప్పారు. విద్య, వైద్యపరమైన సేవా కార్యక్రమాలే తానా ఫౌండేషన్ ప్రాధాన్యాలుగా ఉంటాయని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించినట్లు శృంగవరపు నిరంజన్ తెలిపారు. ఆయా కార్యక్రమాలకు అవసరమైన నిధుల సేకరణకు అమెరికా వ్యాప్తంగా ఫౌండేషన్ కార్యక్రమాలకు విసృత ప్రచారం కల్పించేందుకు బృందం కృషి చేస్తుందని చెప్పారు. తానాలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు.













