ఆయనను గద్దె దించటమే మా లక్ష్యం
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించి అక్కడి రాజకీయ సంక్షోభానికి తెరదించటమే తమ ముందున్న ప్రాధాన్యతాంశమని ఐరాసలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ చెప్పారు. ఆమె ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని ఓడించటం, సిరియాను ఇరాన్ ప్రభావం నుండి బయటపడేయటం, అసద్ సర్కారును గద్దెదించటం తమ ముందున్న ప్రధాన్యంతాంశాలని అన్నారు. అసద్ అధికారంలో వున్నంత కాలం సిరియాలో శాంతి వుండదని ఆమె సృష్టం చేశారు.






