మండలి సంస్కరణలకు అనుకూలమే
తమ వీటో అధికారాన్ని ఉపసంహరించనంత కాలం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలకు తాము సుముఖమేనని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ తెలిపారు. ఇదే విషయాన్ని ఐరాస సభ్య దేశాలన్నిటికి సృష్టం చేశామని చెప్పారు. కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల కమిటీ విచారణ సందర్భంగా హేలీ మాట్లాడారు. భద్రతా మండలిలో భారత్ సభ్యత్వానికి మద్దతిస్తున్న కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా అడిగిన ప్రశ్నకు నిక్కీ హేలీ పై విధంగా స్పందించారు. భద్రతా మండలి సంస్కరణలపై భిన్న రకాల ప్రణాళికలు, వాదనలు వినిపిస్తున్నాయని, వాటి గురించి తాము తెలుసుకుంటూను వున్నామని చెప్పారు.













