రొమ్ము కేన్సర్ చికిత్సకు కొత్త ఔషధం!
మహిళల్లో రొమ్ము కేన్సర్‌ను నిరోధించే కొత్త అణువును కనుగొన్నారు టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు. ఈ పరిశోధక బృందంలో భారత సంతతికి చెందిన గణేష్ రాజ్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు రొమ్ము కేన్సర్ చికిత్సకు హార్మోన్ థెరపీ వంటి సాంప్రదాయ పద్ధతులను మాత్రమే ఉపయోగిస్తున్నారు. వాటికి కూడా లొంగని రొమ్ము కేన్సర్ కణాలను ఈ కొత్త అణువును కలిగిన ఈఆర్‌ఎక్స్-11 ద్వారా తొలగించవచ్చని గణేష్ తెలిపారు. ఈస్ట్రోజన్ గ్రాహక కేన్సర్ కణాలను ఈ అణువు టార్గెట్ చేస్తుందని తెలిపారు. ఈ ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించామని తెలిపారు.













