ఈ బ్యాగు ఖరీదు రూ.25.95 కోట్లు!
చూసేందుకు సాదాసీదాగా ఉంది. మామూలు బ్యాగే కదా? దీనికి ఇంత రేటా? అని అనుకుంటున్నారా. కానీ దీనికి ఓ విశిష్టత ఉంది. ఏకంగా చందమామపైకి వెళ్లొచ్చింది మరి. 48 ఏళ్ల క్రితం చంద్రుడిపై అడుగుపెట్టిన వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తనతో పాటు ఈ బ్యాగును తీసుకెళ్లారు. వచ్చేటప్పుడు అందులో అక్కడి దుమ్ము, ధూళిని పట్టి తెచ్చారు. ఇప్పుడా బ్యాగును జూలై 20న సోథ్బేలో వేలం వేయనున్నారు. ఇది కనీసంగా రూ.25.95 కోట్లు (40 లక్షల డాలర్లు) ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ బ్యాగుతో పాటు ఆర్మ్‌స్ట్రాంగ్ ఉపయోగించిన వస్తువులను కూడా వేలం వేయనున్నారు.













